భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల ఉత్పత్తి.. అసెంబుల్ యూనిట్ ఏర్పాటు యోచనలో అమెరికా సంస్థ

అమెరికాకు చెందిన ఏరో స్పేస్ కంపెనీ ‘‘జాంట్ ఎయిర్ మొబిలిటీ’’ ఈ దశాబ్ధం ముగిసేలోపు భారత్‌లో eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్ ట్యాక్సీల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది.ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం) సొల్యూషన్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇటీవల ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది.

 America Based Jaunt Air Mobility Looks To Assemble Electric Air Taxis In India,i-TeluguStop.com

ఇది 2026 నాటికి కెనడియన్, యూఎస్, యూకే ఏవియేషన్ రెగ్యులేటింగ్ ఏజెన్సీల నుంచి ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.అదే ఏడాది 1.5 మిలియన్ డాలర్ల విలువైన apiece air taxis లను పంపిణీ చేయాలని కంపెనీ భావిస్తోంది.
జాంట్ ఎయిర్ మొబిలిటీ అనేది AIRO గ్రూప్‌లో భాగం.

దీనిని ఢిల్లీలో జన్మించిన భారతీయ అమెరికన్ చిరింజీవ్ కతురియా స్థాపించారు.భారత్‌పై తమకు భారీ ప్రణాళికలు వున్నాయని.

ఇక్కడ మార్కెట్ చాలా పెద్దదని కతురియా అన్నారు.eVTOL వ్యాపారం కోసం టాటా, మహీంద్రా వంటి భారతీయ కంపెనీలతో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు.

భారతీయ నగరాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో వుంచుకుని అర్బన్ ఎయిర్ మొబిలిటీ కోసం eVTOLకి రానున్న రోజుల్లో గణనీయమైన డిమాండ్ వుంటుందని చిరింజీవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఉదాహరణకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి, ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి డౌన్‌టౌన్ మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు పట్టవచ్చునని ఆయన అన్నారు.

ఇలాంటి మరెన్నో నగరాలు, ప్రయాణాలకు eVTOL అనువైనదన్నారు.

భారత్‌లో eVTOL యూనిట్ కోసం 75 మిలియన్ డాలర్లు ఖర్చవతుందని అంచనా.

స్థానిక డిమాండ్‌తో పాటు భారత్ నుంచి దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కతురియా అన్నారు.అలాగే భారత్‌లో ఆరోగ్య సంరక్షణ సేవల కోసం డ్రోన్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఈ సదుపాయాన్ని భారత్‌కు తీసుకురావడానికి అపోలో హాస్పిటల్స్ సహా మిగిలిన ఆసుపత్రులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.స్ట్రక్చరల్ డిజైన్ అనాలిసిస్, సర్టిఫికేషన్ సపోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ సేవలను అందించే ఎల్ అండ్ టీ కాకుండా విమాన నియంత్రణలు, పవర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ కోసం బీఏఈ సిస్టమ్స్‌తో చేతులు కలిపినట్లు కతురియా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube