అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నీటి కుక్కలు కోనసీమ కాలువలలో హల్ చల్ చేశాయి.సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లోనూ కనిపించే నీటి కుక్కలు కోనసీమ పంట కాలువలలో సందడి చేశాయి.
అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామ పరిధిలోని ప్రధాన పంట కాలవలో నాలుగు నీటి కుక్కలు కలియతిరిగాయి.భారీ వర్షాలు, వరదలతో కనిపించిన నీటి కుక్కలను చూసిన స్థానికులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు.