అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే విమాన టిక్కెట్.. కొనుగోలు చేయండిలా..

జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతిఒక్కరికీ ఉంటుంది.దీంతో చాలామంది తమ కోరికను నెరవేర్చుకునేందుకు ఒక్కసారి విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది.

 Amazing Offer Cheap Flight Ticket Buy It, Google, Offers, Latest News, Flight Of-TeluguStop.com

ఇక విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అయితే విమాన ప్రయాణం( air travel ) అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్న పని.విమాన ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉంటాయి.దీంతో సామాన్యులు విమానంలో ప్రయాణించలేని పరిస్థితి.

ఏదైనా అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రజలు విమానంలో ప్రయాణించరు.

Telugu Google, Latest, Offers, Ticket-Latest News - Telugu

అయితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా విమానయాన సంస్థలు పండుగల సమయాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.ఈ డిస్కౌంట్స్ సమయంలో తక్కువ రేటుకే విమానంలో ప్రయాణం చేయవచ్చు.కానీ తాజాగా గూగుల్ సరికొత్త ఫీచర్( Google’s newest feature ) ను తీసుకొచ్చింది.

గూగుల్ ఫ్లైట్స్ ( Google Flights )పేరుతో కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది.ఇందులో తక్కువ ధరకే విమాన టికెట్ కొనుగలు చేయవచ్చు.గూగుల్ తీసుకురానున్న ఇన్‌సైట్స్ అనే ఈ కొత్త ఫీచర్ ఈ వారంలో అందుబాటులోకి రానుంది.ఏ సమయంలో టికెట్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను ఈ ఫీచర్ ద్వారా అందించనుంది.

Telugu Google, Latest, Offers, Ticket-Latest News - Telugu

టికెట్లు ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే తక్కుక ధరకు వస్తాయనే వివరాలను తెలియజేయనుంది.అలాగే ఫ్లైట్ టికెట్ రేటు తగ్గిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఈ ఫీచర్ ను డిజైన్ చేశారు.అమెరికా నుంచి యూరప్ వెళ్లాలంటే 72 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఉత్తమమని ఈ ఫీచర్ చెబుతోంది.అ లాగే క్రిస్మస్ కోసం విమాన ప్రయాణం చేయాలనుకుంటే 71 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని, అక్టోబర్ ప్రారంభంలో టికెట్ బుక్ చేసుకోవడం ఉత్తమమని చెబుతోంది.

ఈ ఫీచర్ విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుందని చెప్పవచ్చు.కొద్దిరోజుల్లో ఈ ఫీచర్ ను లాంచ్ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube