బాలీవుడ్ లో కొంత మంది స్టార్ సెలబ్రిటీస్ ఏదైనా పండగ వచ్చినప్పుడు తమ తరుపున ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లందరికీ ఆహ్వానం పంపి గ్రాండ్ గా పార్టీ ఇస్తారు.అలాంటి కల్చర్ చిన్నగా మన టాలీవుడ్ కూడా అలవాటు చేసుకుంటుంది.
ఇక్కడ ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇలాంటి పార్టీలు ఇస్తూ ఉంటారు.కొద్దీ రోజుల క్రితమే దీపావళి పార్టీ ని గ్రాండ్ గా నిర్వహించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ).ఈ పార్టీ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ , నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా సతీసమేతంగా పార్టీ కి విచ్చేసారు.వీళ్లంతా కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.
అందరూ కలిసి ఫోటోలు దిగారు, బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ మాత్రం వెంకటేష్ తో తప్ప ఎవరితోనూ పెద్దగా కలవలేదు.
రామ్ చరణ్ కాకుండా ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ కి మంచి స్నేహితులు గా ఎన్టీఆర్ మరియు ప్రభాస్ నిలిచారు.ప్రభాస్ ఈ పార్టీ కి రాలేదు కానీ, ఎన్టీఆర్ తో మాత్రం అల్లు అర్జున్ చాలా క్లోజ్ గా ఈ పార్టీ లో మాట్లాడుతూ వచ్చాడు.కానీ మహేష్ బాబు మాత్రం అల్లు అర్జున్ తో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదట.
రెండు మూడు సార్లు కలుపుగోలుగా మహేష్ తో మాట్లాడాలని చూసినా ఆయన నుండి ఆశించిన రేంజ్ రెస్పాన్స్ రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త.చాలా కాలం నుండి మహేష్ మరియు అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్.‘సరిలేరు నీకెవ్వరూ’ మరియు ‘అలా వైకుంఠపురం లో‘ చిత్రాల మధ్య ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో, అప్పటి నుండి వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వచ్చిందని టాక్.
ఇక పుష్ప సినిమా స్టోరీ ముందుగా మహేష్ బాబు( Mahesh Babu ) దగ్గరకి వెళ్లడం, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ని తీసుకొని రమ్మని సుకుమార్ కి చెప్పడం, సుకుమార్ మళ్ళీ మహేష్ దగ్గరకి వెళ్లకుండా నేరుగా అల్లు అర్జున్ వద్దకి వెళ్లి, ఈ స్టోరీ వినిపించి ఓకే చేయించడం వంటివి జరిగాయి.దీనికి మహేష్ బాబు బాగా హర్ట్ అయ్యాడు, అంతే కాలేదు ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ రన్నింగ్ లో ఉన్నప్పుడే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా కి సంబంధించి ప్రకటన ఇప్పించడం వంటివి కూడా మహేష్ ని బాధించాయంట.అందుకే ఆయన అల్లు అర్జున్ కనిపించినా మాట్లాడకపోవడానికి కారణం అని అంటున్నారు.
ఏది ఏమైనా మహేష్ అంత పార్టీ లో అల్లు అర్జున్ ని పలకరించకపోవడం, అల్లు అర్జున్ అవమానం గా భావిస్తున్నాడట.