ఆ విషయంలో అల్లు అర్జున్ ని టాప్ 5 లో నిలబెట్టిన పుష్ప.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న పుష్ప సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది.

 Allu Arjun Remuneration For Pushpa 2 Movie , Pushpa 2 , Allu Arjun , Remunerat-TeluguStop.com

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కోవడం తో పాటు అన్ని భాషల ప్రేక్షకులను కూడా మెప్పించే విధంగా పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Allu Arjun, Pushpa, Rashmika, Sukumar, Tollywood-Movie

పుష్ప సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో టాప్ లో అల్లు అర్జున్ నిలిచినట్లుగా తెలుస్తోంది.టాప్ 5 లో అల్లు అర్జున్ ఉన్నాడని సమాచారం తో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీ లో ఎంతో మంది సీనియర్ హీరోలు ఉండగా అల్లు అర్జున్ టాప్ 5 లో ఉండడం ఆశ్చర్యంగా ఉందంటూ సోషల్ మీడియా లో కొందరు కామెంట్ చేస్తున్నారు, మొత్తానికి పుష్ప సినిమా దయవల్ల అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది.

Telugu Allu Arjun, Pushpa, Rashmika, Sukumar, Tollywood-Movie

ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 సినిమా స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది.రూ.1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రాబోతున్న పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ యొక్క రేంజ్ ని మరింతగా పెంచడం ఖాయం.అల్లు అర్జున్ కి జోడీగా ఈ సినిమా లో రష్మిక మందన్న కంటిన్యూ అవుతోంది.అంతే కాకుండా అనసూయ మరింత ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది.సుకుమార్ కి ఈ సినిమా మరింత కీలకం కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube