అల్లు అర్జున్( Allu Arjun ) తాజాగా పుష్ప సినిమా లో తన అద్భుతమైన నటనకి గాను ఉత్తమ నటుడు అవార్డ్ ను( Best Actor Award ) జాతీయ స్థాయి లో అందుకున్నాడు.రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ రాజధాని లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అవార్డ్ ని అందుకుంటూ ఉంటే ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు, ప్రేక్షకులు గర్వించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అద్భుతమైన నటన ఆయన సొంతం.ఆయనకు అవార్డ్ రావాల్సిందే.
రావడం గౌరవం.ఇప్పుడు పుష్ప గా అల్లు అర్జున్ అవార్డ్ తీసుకున్న నేపథ్యం లో మరో పుష్ప ఆగే పరిస్థితి కనిపించడం లేదు.

అదేనండి పుష్ప 2 సినిమా( Pushpa 2 ) రూపొందుతున్న విషయం తెల్సిందే.వచ్చే ఏడాది ఆగస్టు లో పుష్ప 2 సినిమా రాబోతుంది.విడుదల ఇంకా చాలా సమయం ఉంది.అయినా కూడా ఏ ఒక్కరు ఆగడం లేదు.జాతీయ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాల వరకు పుష్ప 2 రైట్స్ కోసం పైరవీలు చేస్తున్నారు.కేంద్ర మంత్రులు కూడా పుష్ప 2 రైట్స్ కోసం పైరవీలు చేస్తున్నారు అంటే బన్నీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అద్భుతమైన నటన తో పుష్ప 2 సినిమా తో కూడా కచ్చితంగా మైమరపించడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

అందుకే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కు ఏకంగా అయిదు వంద కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్( Pre Release Business ) అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మధ్య కాలం లో రాజమౌళి సినిమా లకు మాత్రమే ఆ స్థాయి బిజినెస్ అవుతుంది.ఇప్పుడు జాతీయ అవార్డు కారణంగా అల్లు అర్జున్ సినిమాకు అవ్వబోతుంది.
ఇక వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించడం తో పాటు అయిదు వందల కోట్లు ఇతర రైట్స్ ద్వారా రాబోతున్నాయి అంటున్నారు.అంటే నిర్మాతలకు తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల వరకు లాభం గా మిగిలే అవకాశాలు ఉంటాయి అంటున్నారు.