ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో ఈ ఈవెంట్ లో సందడి చేసారు.
ఈ సినిమా గురించి ఈ ఈవెంట్ లో బన్నీ చాలా సేపు మాట్లాడారు.కేవలం ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలపై స్పందించారు.
ఇక ఆయన స్టేజిపై మాట్లాడుతూ ”ఈ సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాతలు కారణం అని చెప్పారు.గీత ఆర్ట్స్ తర్వాత నేను హోమ్ బ్యానర్ గా ఫీల్ అయ్యింది చినబాబుగారి బ్యానరే అంటూ బన్నీ తెలిపారు.
ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి అన్ని ఇండస్ట్రీల సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

ఇక తాను ప్రెసెంట్ చేస్తున్న పుష్ప సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈ స్టేజ్ మీద మాట్లాడారు.టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్స్ లో రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఈ విషయంపై బన్నీ వరుడు కావలెను ఈవెంట్ లో మాట్లాడుతూ.డిసెంబర్ 17న పుష్ప సినిమాతో మేము వస్తున్నాము.మీకు సినిమా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా సినిమా గురించి నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ గా అదీ ఇదీ అని చెప్పలేను.బట్ సినిమా నచ్చాలని మాత్రం కోరుకుంటాను.
అయితే ఇప్పుడు నా సినిమా గురించి ఒక విషయం చెబుతాను.
ఈ సినిమాలో పాటలు అన్నీ బాగా వచ్చాయి.
అన్ని పాటలు చాలా బాగుంటాయి.ఇప్పుడు వచ్చిన వాటి కంటే మిగతావి ఇంకా బాగుంటాయి.
కానీ సినిమా గురించి నేను ఏమి చెప్పలేను.అని బన్నీ తెలిపాడు.
దీంతో ప్రెసెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.బన్నీ ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ ఈ విషయంపై మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది.