సినిమాలలో నటీనటులు కేవలం నటన వరకే పరిమితం అవుతుంటారు.కానీ వాళ్లు నిజజీవితంలో కూడా కొన్ని సేవలను, తమ వ్యక్తిత్వానికి సంబంధించిన పలు విషయాలలో కూడా పాల్గొంటారు.
ఇలా కొందరు నటీ నటులు నిజ జీవితంలో మంచి పేరు సొంతం చేసుకుంటుంటారు.తాజాగా ఓ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో మరో స్టార్ హీరో అభిమానుల కోసం రానున్నాడట.
ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కార్తికేయ ప్రస్తుతం కౌశిక్ పేగళ్ళపాటి దర్శకత్వంలో చావు కబురు చల్లగా సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్ లో తెరకెక్కనుంది.ఇక ఇందులో కార్తికేయ పాత్ర బస్తి బాలరాజు, లావణ్య పాత్ర మల్లికా గా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా మార్చి 19 న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో టాలీవుడ్ స్టార్ హీరో కూడా భాగం కానున్నాడు.ఈ సినిమాకు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో రానున్నాడు.ఇంతకీ ఆయన ఎవరో కాదు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ సినిమా నిర్మాతకు అల్లు అర్జున్ మంచి స్నేహితుడు.ఈయనతో ఉన్న స్నేహబంధం కారణంగా ఈ సినిమా ఈవెంట్ కు రానున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా హీరో హీరోయిన్ మరికొంతమంది నటులతో కలిసి ఓ వీడియోను చేశారు.అందులో వీళ్లు ఈయన నిజంగా వస్తున్నాడా ఈ ఈవెంట్ కు నిజంగా ఒప్పుకున్నాడా అయినా ఆయన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడులే ఇప్పుడు ఈ సినిమా మంచి హిట్ ను సాధించినట్లు అనిపిస్తుందని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు.
అంతేకాకుండా హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో ‘నా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆయన వస్తున్నాడు.AA ఊహే చాలా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు.
మొత్తానికి ఈ సినిమా ఈవెంట్ కు అల్లుఅర్జున్ వస్తున్నట్లు అర్థమైంది.