అల్లరి నరేష్( Allari naresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అంటూ పేరు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.కామెడీ హీరో అంటూ గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత సీరియస్ పాత్రల్లో నటించాడు.
నాంది సినిమాలో( Nandi movie ) సీరియస్ పాత్రలో నటించి నరేష్ ఆకట్టుకున్నాడు.దాంతో అంతకు మించిన సీరియస్ పాత్ర లో ఉగ్రం సినిమాలో( Ugram movie ) కనిపించాడు.
నాంది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కానీ ఉగ్రం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.మరీ దారుణమైన పరాజయం మూట కట్టుకుంది.
బాబోయ్ ఇదే సినిమా అన్నట్లుగా అల్లరోడి అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
ఇక ఉగ్రం సినిమా ఫలితాన్ని బట్టి చూస్తే ముందు ముందు నరేష్ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకోవడం ఉత్తమం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు గతంలో నటించిన మహర్షి సినిమా లో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.దాంతో మళ్లీ కూడా నరేష్ అలాంటి పాత్రల్లో నటించాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
మొత్తానికి అల్లరి నరేష్ ముందు ముందు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా సినిమాలు చేసుకుంటే బెటర్ అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఉన్న హడావుడి నేపథ్యంలో అల్లరోడు పోటీ తట్టుకోలేక పోతున్నాడు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కనుక భారీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తే తప్పకుండా జనాలు నరేష్ ను ఆధరించే అవకాశాలు లేకపోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది.ముందు ముందు నరేష్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.అల్లరి నరేష్ ఇంకా కూడా సినిమాలు చేస్తానంటే జనాలు ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలి.ఈ మధ్య కాలంలో కామెడీ సినిమా లను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్న దాఖలాలు లేవు.
అందుకే అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు కాలం చెల్లింది.