ఏపీలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయోనని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఎన్నికలు రావడం , పోలింగ్ జరగడం, వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు, కొన్ని సర్వే సంస్థలు చెప్పడం అందరికి తెలిసిన విషయమే.
అయితే ఇప్పుడు అందరి చూపు ఏపీలో హాట్ సీట్ గా మారిన ఏకైక నియోజకవర్గం మంగళగిరిపై పడింది.అసలు మంగళగిరి నుంచీ గెలుపు టీడీపీ సాధించుకుంటుందా లేక వైసీపీ మరో సారి జెండా ఎగరేస్తుందా అనే ఉత్ఖంట మాత్రం తీవ్ర స్థాయిలో నెలకొంది.
ఈ క్రమంలోనే.
మంగళగిరి నుంచీ అధికార పార్టీ తరుపున పోటీ చేసిన, టీడీపీ భవిష్యత్తు రధసారధి , సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గెలుపుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకేష్ మొదటి సారి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే కావడంతో ఈ స్థానం నుంచీ లోకేష్ గెలుపుపై భారీ అంచనాలే ఉన్నాయి.చాలా మంది లోకేష్ గెలుపు ఖాయమని అంటుంటే, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ గెలుపుకి డోఖా లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు కేవలం ఆ ఒక్క స్థానం నుంచీ భారీస్థాయిలో బెట్టింగులు రావడంతో ఇప్పుడు అందరి చూపు ఆ సీటుపైనే పడింది.

గతంలో ఇదే స్థానం నుంచీ ఆళ్ళ దాదాపు 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ సారి లోకేష్ ప్రత్యర్ధిగా నిలబడటంతో ఈ ఇద్దరి గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకం అయ్యింది.అయితే పోలింగ్ జరిగిన తీరు చూసిన రాజకీయ పండితులు మళ్ళీ ఆళ్ళ గెలుపు పక్కా అని జోస్యం చెప్తున్నారు.
ఈ సారి మెజారిటీ తగ్గచ్చు లేదంటే 15 వేల మెజారిటీ సాధించవచ్చు అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు జగన్ ఆళ్ళ ని మంత్రిని చేస్తానని ఇచ్చిన ప్రామిస్ కూడా ఆళ్ళ సక్సెస్ లో మేజర్ పార్ట్ కాబోతోందట.
కానీ లోకేష్ గెలుపుపై మాత్రం నియోజకవర్గ స్థాయిలో పెద్దగా చర్చలు కూడా జరగకపోవడం గమనార్హం.ఎందుకంటే

లోకేష్ ఆదినుంచీ పొలిటికల్ గా పెద్దగా బలమైన నేతగా మారక పోవడం ఒక కారణమైతే , రెండోది రాజకీయాల్లో చురుకుదనం , పదునైన మాటలు , గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలిగే సత్తా ఉంటేనే ప్రజల్ని సైతం ఆకట్టుకోగలరు.కానీ ఈ అన్ని విషయాలలో లోకేష్ బాబు వీక్ అనే సంగతి ఏపీలో ప్రతీ ఒక్కరికి తెలుసు.ఇలాంటి వ్యక్తిని ఎన్నుకునే కంటే కూడా మన సొంత మనిషిలా ఉండే ఆళ్ళనే మళ్ళీ గెలిపించుకుందాం అనే ఆలోచనకి వచ్చేశారట మంగళగిరి ప్రజానీకం.
దాంతో ఈ పరిణామాలు చూస్తుంటే లోకేష్ కి మంగళగిరి ప్రజలు మంగళం పాడటం ఖాయం అనే టాక్ మాత్రం బలంగా విన్నిపిస్తోంది.