ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ మన ఇండియన్ సినిమాల దగ్గర ఉంది.అందుకే ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు రెడీగా ఉంటారు.
ఇక సంక్రాంతి సీజన్ అంటే చెప్పాల్సిన పని లేదు.ఈ సీజన్ లో అంతా స్టార్ హీరోలు బరిలోకి దిగుతారు.
ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.
మరో 10 రోజుల్లో ఈ రసవత్తరమైన పోటీ మొదలు కాబోతుంది.2023 సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.
రెండు తమిళ్ సినిమాలు.ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ బాగానే ఉండబోతుంది.
మరి కోలీవుడ్ నుండి రాబోతున్న రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాయి.
విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారసుడు.
దీంతో పాటు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజిత్ కుమార్ ‘తునివు’ కూడా రిలీజ్ కాబోతుంది.ఈ రెండు సినిమాలకు కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాలు ప్రెజెంట్ ప్రొమోషన్స్ కు రెడీ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే న్యూ ఇయర్ కు అదిరిపోయే అప్డేట్ లతో ప్రేక్షకులను ఖుషీ చేయబోతున్నారు.ముందుగా అజిత్ కుమార్ తునివు మూవీ థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 31న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అలాగే వారసుడు మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1న రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మరి న్యూ ఇయర్ కానుకగా ఇటు విజయ్, అటు అజిత్ ఇద్దరు ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ రెడీ చేస్తున్నారు.