వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారత సంతతి ప్రజలు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.
సత్యనాదెళ్ల, సుందర్ పిచాయి, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి వంటివారు విజయవంతంగా కంపెనీలను నడిపిస్తున్నారు.వీరిలోనే ఒకరు అజయ్ బంగా.
మాస్టర్ కార్డ్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన అమెరికాలోని భారత సంతతి కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా భారతీయ సమాజంపై బలమైన ముద్ర వేస్తున్నారు.తన వ్యూహ చతురత, నాయకత్వ పటిమతో మాస్టర్ కార్డ్‌ను దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దిన అజయ్ బంగా ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.
తదుపరి సీఈవో, ఎగ్జిక్యూజివ్ ఛైర్మన్‌గా మెరిట్ జానోను మాస్టర్ కార్డ్ బోర్డు ఎన్నుకుంది.ప్రస్తుతం ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ చైర్‌గా పనిచేస్తున్నారు.పదవీ విరమణపై అజయ్ బంగా మాట్లాడుతూ… మాస్టర్ కార్డ్ పరిణామంలో తాను పోషించిన పాత్రపై కృతజ్ఞతలు తెలిపారు.మెరిట్, మైఖేల్‌లు సంస్థను ముందుకు నడిపిస్తారని ఆయన ఆకాంక్షించారు.
దాదాపు ఏడాది పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా వ్యవహరించిన అజయ్ బంగా.ఈ ఏడాది ప్రారంభంలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రమోషన్ పొందారు.
ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత జానోతో పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు.అజయ్ పాల్ సింగ్ బంగా.ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా.లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
అజయ్ బంగా విద్యాభ్యాసం సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, షిమ్లాలలో జరిగింది.బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.