విమాన ప్రయాణానికి బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలలో డిజి యాత్ర అప్లికేషన్ సౌకర్యాన్ని అమలు చేయబోతోంది.డిజి యాత్ర యాప్ ద్వారా ప్రయాణికులు భారీ క్యూలో నిలబడకుండా విమానాశ్రయంలో చెక్ ఇన్ చేయవచ్చు.
ఈ సేవ ద్వారా, ప్రయాణీకుల ముఖం బోర్డింగ్ పాస్‌గా పని చేస్తుంది, ఎందుకంటే డిజి యాత్ర యాప్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా ఉంటుంది.వచ్చే నెల అంటే మార్చి 2023 నాటికి మరో నాలుగు విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలను ప్రారంభించబోతున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
పూణె, విజయవాడ, హైదరాబాద్, కోల్‌కతా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో అమలు చేసే ప్రక్రియ పురోగతిలో ఉందని లోక్‌సభలో ఏవియేషన్ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది.
డిజి యాత్ర యాప్ ద్వారా, ప్రయాణికులు ఎటువంటి ఫిజికల్ బోర్డింగ్ పాస్ లేకుండా కాంటాక్ట్ లెస్ మరియు పేపర్‌లెస్ బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి తమ విమానాల కోసం చెక్-ఇన్ చేయవచ్చు.ఈ యాప్ అధికారిక లాంచ్ డిసెంబర్ 1, 2022న జరిగింది.
తొలి దశలో ఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఇలా నమోదు చేసుకోండి
1.మీరు మీ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఫోన్‌లో డిజి యాత్ర యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.2.యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.3.మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ నమోదు చేయండి.4.యాప్‌లో మీ చిరునామా రుజువును సమర్పించడానికి డిజిలాకర్‌కు ఆధార్‌ను అప్‌లోడ్ చేయండి.5.దీని తర్వాత మీరు సెల్ఫీ తీసుకొని యాప్‌లో సమర్పించాలి.

6.ప్రయాణీకుల వివరాలను నమోదు చేయడం ద్వారా మీ బోర్డింగ్ పాస్‌ను అప్‌డేట్ చేయండి.7.చివరగా ఈ విమానాశ్రయంతో డిజి యాత్ర యాప్ ఐడిని షేర్ చేయండి.
ఈ ప్రయోజనాలు అందుబాటులోకి
1.విమానాశ్రయంలో బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం.2.ప్రయాణీకులకు కాంటాక్ట్‌లెస్ సేవలను అందించడం.3.విమానాశ్రయం వద్ద ప్రయాణీకులకు పొడవైన క్యూల నుండి విముక్తి4.పత్రాలు లేదా హార్డ్ కాపీలు తీసుకురావాల్సిన అవసరం లేదు.5.సెక్యూరిటీ చెక్, డాక్యుమెంట్ మ్యాచింగ్ సులువుగా జరుగుతాయి.
.