మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానం ఉందని రేణుకా చౌదరి అన్నారు.అవసరం అయితే ఇటు ఖమ్మం, అటు గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆమె తెలిపారు.
ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానన్నారు.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఖమ్మంకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానని వెల్లడించారు.అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని రేణుకా చౌదరి సవాల్ చేశారు.







