మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ సినిమా ఈ వారంలో విడుదల కాబోతుంది.దేశ వ్యాప్తంగా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
రియల్ హీరో మేజర్ సందీప్ కథ అవ్వడంతో దేశ వ్యాప్తంగా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అయితే ఈ సినిమా కు తమిళ నాట మాత్రం కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ తో పెద్ద తలనొప్పి తప్పక పోవచ్చు అంటూ ఉన్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మేజర్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆసక్తి ని కలిగించడం లో సక్సెస్ అయ్యారు.మహేష్ బాబు మరియు సోని పిక్చర్స్ వారు కలిసి దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన మేజర్ సినిమా కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది.
మహేష్ బాబు బ్యానర్ లో మొదటి బయటి హీరో సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీ గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా భారీ గానే ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది.
యూఎస్ లో అడవి శేష్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల మంచి వసూళ్లు నమోదు అవుతాయి.ఉత్తరాదిన సందీప్ ఉన్ని కృష్ణన్ కు ఉన్న క్రేజ్ కారణంగా టికెట్లు తెగే అవకాశం ఉంది.
కాని తమిళ నాట మాత్రం సినిమా కు కాస్త గడ్డు పరిస్థితి తప్పక పోవచ్చు అంటున్నారు.కారణం విక్రమ్ సినిమా అక్కడ వంద కోట్ల టార్గెట్ తో రంగంలోకి దిగుతోంది.
అద్బుతమైన సినిమా అంటూ యూనివర్శిల్ స్టార్ కమల్ సన్నిహితులు మరియు విక్రమ్ యూనిట్ సభ్యులు తెగ ప్రచారం చేస్తున్నారు.కనుక తమిళనాట ఆ సినిమాను బీట్ చేసి మన మేజర్ దూసుకు పోవాలంటే మాత్రం చాలా కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విక్రమ్ నిరాశ పర్చి మేజర్ అద్బుత విజయం సాధిస్తే అప్పుడు తమిళనాట మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.