హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగుతోంది.పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు.
ఆదివాసీ బిడ్డ కావడం వలనే ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా అవమానిస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.కాగా ఇవాళ ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.