పీపుల్స్ మీడియా భారీ రిస్క్.. ఆదిపురుష్ కోసం ఏకంగా అంత పెట్టిందా?

Adipurush Telugu Theatrical Rights Gets Sold For Whopping Details, People Media Factory, Adipurush, Prabhas, Adipurush Telugu Theatrical Rights,People Media Factory Latest News, People Media Factory On Adipurush Movie

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య భారీ రిస్కులను చేస్తుంది.ఈ సంస్థ ఈ మధ్య కాలంలో కార్తికేయ 2, ధమాకా వంటి సినిమాలతో మంచి ఊపు మీద ఉంది.

 Adipurush Telugu Theatrical Rights Gets Sold For Whopping Details, People Media-TeluguStop.com

కానీ మళ్ళీ రామబాణం వంటి డిజాస్టర్ అందుకోక తప్పలేదు.ప్రెజెంట్ ఈ సంస్థ బ్రో సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ భారీ రిస్క్ చేస్తున్నాయి.

అలాగే ప్రభాస్, మారుతి సినిమాను డివివి దానయ్య( DVV Dhanayya ) నుండి సింగిల్ పేమెంట్ 45 కోట్లు ఇచ్చి టేకోవర్ చేసి మరో రిస్క్ చేసింది.

Telugu Adipurush, Adipurushtelugu, Factory, Factory Latest, Prabhas-Movie

ఇలాంటి రిస్కులు చేస్తున్న నేపథ్యంలో అంతా ఈ నిర్మాణ సంస్థ గురించి తెగ మాట్లాడు కుంటున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఆదిపురుష్ ( Adipurush movie )రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏకంగా 185 కోట్లతో తీసుకోవడం షాక్ ఇస్తుంది.పీపుల్స్ మీడియాకు( People Media ) ఏమైనా పిచ్చి పట్టిందా అనేంతగా కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులనే అంత పెట్టి కొనడం చాలా పెద్ద రిస్క్ అంటున్నారు.

Telugu Adipurush, Adipurushtelugu, Factory, Factory Latest, Prabhas-Movie

ఆదిపురుష్ రెగ్యురల్ ఫార్మాట్ మూవీ కాదు.అందుకే తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గరగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే కానీ కొన్న డబ్బులు రావు.ఇది మాములు విషయం కాదు.రిపీట్ ఆడియెన్స్ ఉంటేనే తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది.మరి ఆదిపురుష్ వంటి సినిమాను ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ ఒక్కసారి చూడడమే ఎక్కువ.అలాంటిది మళ్ళీ రిపీటెడ్ గా చూడడం అంటే కష్టమే.

అదీకాక ఆంధ్రాలో 80 కోట్లు, నైజాం లో 70 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయగలిగితేనే రికవరీ ఉంటుంది.రిలీజ్ తర్వాత పరిస్థితి చెప్పలేం.డిస్టిబ్యూటర్స్ ను పీపుల్స్ మీడియా ఎలా ముందుకు వచ్చేలా చేస్తుంది.అంత పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అనేదే ఇక్కడ సమస్య.

ఇవన్నీ తెలిసిన పీపుల్స్ మీడియా ఎందుకు రిస్క్ తీసుకుంటుంది.వీరి స్ట్రాటజీ ఏంటి అనేది చూడాలి.

ఈ రిస్క్ వర్కౌట్ అయితే ఓకే.లేకపోతే ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవడం ఖాయమే అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube