తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సాయిపల్లవి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.అయితే విరాటపర్వం సినిమా తర్వాత సాయి పల్లవి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
దీంతో ఈమె సినిమాలకు దూరం అవుతుందని,ఈమె వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో తన వైద్య వృత్తిలో స్థిరపడతారు అంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తలపై సాయి పల్లవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ… అందం అన్నది రూపంలో కాదు గుణంలో ఉంటుందని చెప్పే చిత్రం ప్రేమమ్.ఈ సినిమాతో నా సినీ కెరియర్ ప్రారంభమైంది.
ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు.తాను ఎంబిబిఎస్ చదివిన నటి కావాలనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు ఏమాత్రం అడ్డుపడలేదు.
అదేవిధంగా నేను నటించిన ప్రతి ఒక్క సినిమా పాత్ర ప్రేక్షకులకు నచ్చాలనే కోరుకుంటాను.ప్రేక్షకులు కూడా నన్ను తమ ఇంటి ఆడపడుచుగా భావించడం చాలా సంతోషంగా ఉంది.
ఇప్పటికీ తనకు మంచి సినిమా కథలు కనుక వస్తే నటించడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా సాయి పల్లవి సినిమాల గురించి చెప్పడంతో ఈమె ఇండస్ట్రీకి దూరం అవుతుందని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అర్థమైంది.మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమా అవకాశాలు వస్తే కనుక నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియడంతో సాయి పల్లవిని తిరిగి వెండితెరపై చూడటానికి అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.