బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన బాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ కృతి కర్భందా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Actress Kriti Kharbanda Introduces Her Boyfriend Pics Goes Viral , Kriti Khar Ba-TeluguStop.com

బోణి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తీన్మార్,మిస్టర్ నూకయ్య,ఒంగోలు గిత్త వంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఈ సినిమాలు మంచి సక్సెస్ ని సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ బాయ్ బాయ్ చెబుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక హిందీలో హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే సినిమాలతో ఆకట్టుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు అందాలకు కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.వాలెంటెన్స్ డే సందర్భంగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది.

ఈమె గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్ తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఇక కృతి కర్భందా బాయ్ ఫ్రెండ్ పులికిత్ విషయానికి వస్తే.

హిందీలో పలు సినిమాలు సీరియల్స్ తో ఆకట్టుకున్న ఇతను గతంలో శ్వేతా రోహిరా అనే ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు.కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లి అయిన చేయడానికి విడాకులు తీసుకొని విడిపోయారు.ప్రస్తుతం కృతి కర్భందా తో ప్రేమలో ఉన్న పులికిత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube