ప్రముఖ టాలీవుడ్ నటుడు సంపత్ రాజ్( Sampath Raj ) ఒకవైపు సినిమాలతో, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో ఆయన నటించగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపత్ రాజ్ మాట్లాడుతూ నేను సెల్ఫిష్ యాక్టర్ అని తెలిపారు.
పంజా సినిమాతో( Panja Movie ) తెలుగులో నా జర్నీ స్టార్ట్ అయిందని ఆయన తెలిపారు.చరణ్ ( Ram Charan ) నుంచి నేను సింప్లిసిటీ నేర్చుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.
హీరో రామ్ ఎలాంటి పాత్రలో అయినా నటించగలడని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు.నా కూతురు మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ అని సంపత్ రాజ్ అన్నారు.తారక్ ( NTR ) ఎనర్జీ మైండ్ బ్లోయింగ్ అని సంపత్ రాజ్ తెలిపారు.కాన్ఫిడెన్స్ కు రవితేజ ఉదాహరణ అని సంపత్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రవితేజ ఎనర్జీ సాలిడ్ ఎనర్జీ అని అయన తెలిపారు.షాట్ బాగా చేస్తే రవితేజ ఎంతగానో ఎంకరేజ్ చేస్తారని సంపత్ రాజ్ వెల్లడించారు.
ప్రభాస్ యాక్టింగ్ స్క్రీన్ పై చూస్తే తెలుస్తుందని ఆయన కామెంట్లు చేశారు.మిర్చి సినిమాకు నా వాయిస్ నచ్చి నేనే డబ్బింగ్ చెప్పాలని ప్రభాస్ సూచించడం జరిగిందని సంపత్ రాజ్ కామెంట్లు చేశారు.ఆ సినిమా డబ్బింగ్ కోసం రెండున్నర రోజులు పని చేశానని ఆయన తెలిపారు.సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో అనుకున్నానని నా కూతురు నా దగ్గరికి వచ్చిన సమయంలో నాకు సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని సంపత్ రాజ్ తెలిపారు.
నా కూతురిని ఐదేళ్ల పాటు బోర్డింగ్ స్కూల్ లో ఉంచానని ఆయన కామెంట్లు చేశారు.నా కూతురు మంచి క్రిటిక్ అని తనకు సినిమాలపై ఆసక్తి లేదని తన కూతురు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తుందని సంపత్ రాజ్ వెల్లడించారు.మదర్ తో కూతురు టచ్ లో ఉంటుందని నేను, నా భార్య విడాకులు తీసుకున్నా నా భార్యతో మాట్లాడతానని ఆయన తెలిపారు.