నటుడుగా, అద్భుతమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు.గత కొద్ది రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
ఈ క్రమంలోనే అతడు, తన కుటుంబం మొత్తం కరోనా బారినపడ్డట్లు నిర్ధారణ కావడంతో పోసాని కుటుంబం మొత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి తను తన కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడినట్లుగా ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.నాకు పలు సినిమాలలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలందరూ నన్ను క్షమించాలి… ఈ సినిమాలో నటించడం కోసం అవకాశం వచ్చినప్పటికీ కరోనా బారిన పడటం వల్ల సినిమా షూటింగ్లో పాల్గొన్న లేకపోతున్నాను.
నా వల్ల సినిమా షూటింగ్ కి ఇబ్బంది జరిగితే మన్నించాలి.నేను కరోనా బారిన పడటం వల్ల రెండు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయని ఈ సందర్భంగా పోసాని తెలిపారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి పోసాని కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.మీ అందరి ఆశీర్వాదం నా పైన,నా కుటుంబంపై ఉంటే త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడి షూటింగ్ లలో పాల్గొంటానని ఈ సందర్భంగా పోసాని మీడియాకు వెల్లడించారు.అయితే ఇది వరకు ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది సెలబ్రెటీలు కోలుకున్న సంగతి మనకు తెలిసిందే.