మొన్నటి వరకు ప్రాంతాల చుట్టూ, పార్టీల చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా కులాల వారీగా విడిపోయింది.మరీ ముఖ్యంగా దళితుల చుట్టు పెద్ద ఎత్తున రాజకీయాలు అలుముకున్నాయి.
దీంతో అందరూ ఇప్పుడు దళితుల రాగం ఎత్తుకుంటున్నారు.ఇక హుజూరాబాద్‌లో వారి ఓట్లే కీలకం కావడంతో సీఎం కేసీఆర్ అయితే ఒక్క ఉప ఎన్నిక కోసం ఏకంగా దళితబంధు లాంటి స్కీమ్ కూడా తీసుకొస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇంతలా ఎఫెక్ట్ చూపిస్తున్న దళితులను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని ఈటల కూడా భావిస్తున్నారు.
మొన్నటి వరకు తననే ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్న ఈటల రాజేందర్‌కు ఒక్క సారిగా దళిత బంధు ఎఫెక్ట్ తాకింది.
ఇంటికి పది లక్షల ఇస్తామంటే ఎక్కడ దళితులు తనకు వ్యతిరేకంగా మారుతారో అని భావించిన ఈటల రాజేందర్ ఇప్పుడు దళిత నేతలను తన వెంటే తిప్పుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.అలాగే నిన్న జరిగిన పాదయాత్రలో ఒక మెట్టు దిగి మరీ దళితుల కాళ్లు కడిగారు.
దీంతో తనకు దళితులు ఎంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం చేశారు.ఇదే క్రమంలో కేసీఆర్ దళితులకు చేస్తున్న అన్యాయం గురించి కూడా విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇక్కడే ఒక విషయం అంతు పట్టుకుండా ఉంది.ఈటల రాజేందర్‌కు నిజంగానే దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఈ పని ఏదో ముందే చేసి ఉండొచ్చు కదా.కేసీఆర్ స్కీమ్ ప్రవేశ పెట్టిన తర్వాత ఎందుకు చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.అంటే కేసీఆర్ ఏదైనా స్టెప్ తీసుకుంటే దాన్ని ఈటల రాజేందర్ ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే ఈ మధ్య ఈటల రాజేందర్ ప్రతిపని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే దాని ఎఫెక్ట్ తన మీద పడకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు.