ఒకరు చేసిన పనికి ఇంకొకరు బలి కావడమంటే ఇదేనేమో అనిపిస్తోంది.ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
కారణం దళిత బంధు ఎఫెక్ట్ అలాగే నియోజకవర్గ అభివృద్ధి.అదేంటి దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.
కేసీఆర్ పంతానికి పోయి ఎలాగైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారు.ఇప్పుడే కాదు గతంలోనూ సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది.
దీంతో అప్పటి నుంచే ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది.
ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కొత్తగా దళితబంధు లాంటి స్కీమ్ పెట్టడం అలాగే నియోజకవర్గానికి భారీగా నిధులు ఇవ్వడం కొత్తగా పింఛన్లు ఇవ్వడం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అలాగే రోడ్లు వేయడం, రెండో విడత గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ ఏర్పడింది.
అదేంటంటే ఉప ఎన్నికలు వస్తేనే తమ నియోజకవర్గానికి నిధులు వస్తాయని అలాగే దళత బంధు లాంటి స్కీములు వస్తాయని, కొత్తగా అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతుందనే భావన గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.ఇక దీనిపై ఏకంగా ఎమ్మల్యేలు స్టేట్ మెంట్ ఇచ్చేదాకా వచ్చింది.చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయబోమని చెప్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రతిపక్షాలైతే దొరికిందే అవకాశం అన్నట్టు తాము రాజీనామాలు చేస్తామని నిధులు ఇస్తారా అంటూ డిమాండ్లు పెడుతున్నారు.ఇలా మొత్తానికి కేసీఆర్ చేస్తున్న పనులు చివరకు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటున్నాయన్నమాట.
మరి కేసీఆర్ దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.