Govind Pamasoorya : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో.. సీరియల్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్?

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.

 Actor Padma Soorya Engagement Actress Gopika Anil-TeluguStop.com

అందులో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంట( Varun Tej-Lavanya tripathi Marriage ) కూడా ఒకటి.ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు.

త్వరలోనే ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.సీరియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక అమ్మాయితో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బుల్లితెర వెండితెర ప్రేక్షకులు అభిమానులు ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Telugu Padma Soorya, Actressgopika, Tollywood-Movie

ఆ యంగ్ హీరో మరెవరో కాదు మలయాళ నటుడు పద్మ సూర్య( Padmasoorya ). సొంత ఇండస్ట్రీలో హీరోగా ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 లాంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పద్మ సూర్య.

కాగా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో( Ala Vaikunthapurramuloo ) చిత్రంలో విలన్ కొడుకుగా నటించాడు.అంతేకాకుండా బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు.

మరోవైపు టీవీ షోల హోస్ట్‌గానూ రాణిస్తున్నాడు.

Telugu Padma Soorya, Actressgopika, Tollywood-Movie

పద్మసూర్య సీరియల్ బ్యూటీ గోపిక అనిల్‌( Gopika Anil )తో నిశ్తితార్థం చేసుకున్నాడు.అయితే వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమని స్వయంగా పద్మ సూర్యనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.ఇకపోతే జంట చూడచక్కగా ఉందని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వీరి పెళ్లికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఎంగేజ్మెంట్ ఫోటోలను( Padmasoorya Engagement ) చూసిన అభిమానులు పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు నెటిజన్స్ సూపర్ జోడి క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube