బాహుబలి సినిమా కి ఎంత అయితే క్రేజ్ దక్కిందో కేజీఎఫ్ సినిమాకు కేసుల అంతే క్రేజ్ దక్కింది అని చెప్పాలి.కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
దీనితో ఈ చిత్ర సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది.కేజీఎఫ్ 2 గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా,కన్నడ తో పాటు మిగిలిన ఇండస్ట్రీ లలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇక దాదాపు క్లైమాక్స్ కూడా కూడా వచ్చేయగా, ఇప్పడు ఒక బ్రేకింగ్ వార్త హల్ చల్ చేస్తుంది.ఆ వార్త ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో జర్నలిస్ట్ కమ్ రైటర్ కమ్ నేరేటర్ పాత్రలో కనిపించైనా ప్రముఖ నటుడు అనంత్ నాగ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
మొదటి భాగంలో నటించిన ఆయనను రెండో భాగంలో కూడా తీసుకున్నారు.అయితే ఆయన పాత్రలో అంత సంతృప్తి లేదని అనంత్ నాగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దీంతో ఆ పాత్రను మరో నటుడితో చేయించబోతున్నట్లు తెలుస్తోంది.నిజానికి చెప్పాలంటే కేజీఎఫ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పాత్రల్లో అనంత్ నాగ్ పాత్ర ఒకటి.
ఆ కథను ఆయన చెప్పే విధానం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది.

కానీ ఇప్పుడు రెండో భాగం నుంచి అనంత్ నాగ్ తప్పుకుంటే.ఆ పాత్రకు ఏ నటుడు న్యాయం చేయగలరన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.అయితే ఇది నిజంగా నిజామా లేదంటే ఒక రూమరా అన్నది మాత్రం తెలియరాలేదు.
ఇంకా చిత్ర బృందం ఈ వార్తలపై స్పంచలేదు,అలానే అనంత్ నాగ్ తప్పుకున్నట్లు కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఆ విషయం తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.