రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమా సాధించిన రికార్డులలో మెజారిటీ రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు.ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ బాహుబలి2 సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాహుబలి2 సినిమాలో అనుష్కకు నాకు ఫైట్ సీన్ ఉంటుందని సీన్ లీక్ కావడం, ఎడిటింగ్ వల్ల నా సీన్లు పోయాయని ఆయన తెలిపారు.
ప్రొడ్యూసర్లు బ్రతికితే మాత్రమే సినిమా స్థాయి పెరుగుతుందని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.
కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ రేంజ్ ను చూపించుకోవడం కోసం అసిస్టెంట్లను పెట్టుకుంటారని ఆయన తెలిపారు.కొంతమంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుందని అజయ్ ఘోష్ కామెంట్లు చేయడం గమనార్హం.
నేనేంటో నాకు తెలుసని నా నుంచి దర్శకనిర్మాతలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తానని అజయ్ ఘోష్ చెప్పారు.
నాకున్న పరిధిలో నాకున్న దానిని బట్టి నేను ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు.
నేను ఏ విధంగా ఉండాలో చెప్పడానికి అవతలి వ్యక్తికి అవసరమేంటని ఆయన చెప్పుకొచ్చారు.పుష్ప సినిమా తర్వాత ఇతర భాషల సినీ ప్రముఖుల నుంచి కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.ప్రశాంత్ నీల్ కథ చెప్పారని సినిమాలో ఉంటానో లేదో తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.బిజినెస్ చేసే సమయంలో బిజినెస్ ధోరణి ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.
నేను వ్యక్తిత్వాన్ని చంపుకొని పని చేయనని అజయ్ ఘోష్ పేర్కొన్నారు.ఈ మధ్య ఒక పెద్ద సినిమాకు పని చేశానని ఆరు రోజులకు ఆరు లక్షల రూపాయలు వస్తాయని అనుకుంటే మూడు రోజుల్లో నా పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో మూడు లక్షలు ఇచ్చారని ఆయన చెప్పారు.రోజుకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని ఆయన పరోక్షంగా వెల్లడించడం గమనార్హం.