విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంది.ఈ క్రమంలో విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండా  ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.

 Jagan Unfurled The National Flag At Indira Gandhi Municipal Stadium, Vijayawada,-TeluguStop.com

వేడుకలలో భాగంగా 12వ కాంటిజెంట్స్ నిర్వహించిన పెరేడ్ నీ జగన్ తిలికించడం జరిగింది.ఆ వాహనంలో సీఎం జగన్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పది బ్రాండ్స్ ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం

సీఎం జగన్ ప్రసంగిస్తూ.

జాతీయ జెండా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా… అది పింగళి వెంకయ్య రూపొందించిన జెండా అని చెప్పుకొచ్చారు.

జాతీయ పతాకం మన స్వాతంత్రానికి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక.సార్వభౌమత్వానికి.ఏకత్వానికి, దేశభక్తికి మన ఆత్మ గౌరవానికి ప్రతీక.వాదాలు వేరైనా దేశ స్వాతంత్రంమే గమ్యంగా పోరాడారు… ఆనాటి యోధులు.

వాళ్లని స్మరించుకుంటూ హాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది.

Telugu Ap Cm Ys Jagan, Indiragandhi, Vijayawada-Telugu Political News

దేశ స్వాతంత్ర పోరాటం మానవాళి మహోన్నత చరిత్రగా సదా కాలం నిలిచి ఉంటుంది.75 ఏళ్ళ  స్వాతంత్ర దేశం ప్రపంచంతో పోటీపడి మరి అభివృద్ధి సాధిస్తుందని కొనియాడారు.ఇంకా అనేక రంగాల గురించి మాట్లాడుతూ దేశం టాప్ స్థానాలలో నిలిచిందని స్వాతంత్ర వేడుకలలో సీఎం జగన్ ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube