చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు.ఇందులో భాగంగా తహసీల్దార్ రమణిని చిత్తూరు కలెక్టరేట్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా పూతలపట్టు తహసీల్దార్ కు పెనుమూరు ఎమ్మార్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.ఆన్ లైన్ లో భూమి వివరాలు నమోదు చేసేందుకు గానూ పెనుమూరు ఎమ్మార్వో రమణి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎమ్మార్వోపై అధికారులు చర్యలకు సిద్ధమైయ్యారు.