హైదరాబాద్ చంపాపేట్ లో యువతి దారుణ హత్య..!

ఇటీవలే కాలంలో ప్రతి సమస్యకు దారుణ హత్యలే పరిష్కారం అనుకుంటున్నారు కొందరు మూర్ఖులు.ప్రాణం విలువ తెలియని వ్యక్తులు దారుణ హత్యలకు పాల్పడతారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 A Young Woman Was Brutally Murdered In Champapet Hyderabad , Hyderabad , Champa-TeluguStop.com

హైదరాబాద్( Hyderabad ) నగరంలోని చంపాపేట్( Champapet ) లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.చంపాపేట్ లోని రాజిరెడ్డి నగర్ లో స్వప్న( Swapna ) అనే యువతి దారుణ హత్యకు గురైంది.ఆ తరువాత అదే ఇంట్లో ఉంటున్న వ్యక్తి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.బిల్డింగ్ పైనుంచి దూకిన వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో పక్కనే ఉన్న స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

పోలీసులకు( Police ) సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వప్న మృతదేహాన్ని పరిశీలించి కత్తితో దాడి చేసి హత్య చేశాడని, తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోస్ట్ మార్టం నిమిత్తం స్వప్న మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పోలీసులకు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఇద్దరు ప్రేమికులా? లేదంటే స్నేహితులా? యువకుడు హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు తెలియాలంటే.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి త్వరగా కోలుకోవాల్సి ఉందని తెలిపారు.ప్రస్తుతం పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉండే స్థానికులను వీరి వివరాలపై అరా తీస్తున్నారు.

త్వరలోనే ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube