కొందరు ప్రజలు అతి నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు.అతివేగంతో దూసుకెళ్తా వేరే వాహనాలను ఓవర్‌టెక్ చేస్తుంటారు.
మరికొందరు ఏదో వీడియో గేమ్స్ ఆడినట్టు రోడ్లపై కార్లతో ఆడేస్తారు.ఏదో యాక్షన్ సినిమాలో స్టంట్స్ చేసినట్టు బయట కూడా వీరు చేస్తుంటారు.
ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి.ఇప్పుడు అలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇందులో ఒక స్టంట్ చేస్తున్నప్పుడే ప్రమాదం జరిగింది.ఈ దృశ్యాలు చూసిన అందరికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది.
వైరల్ వీడియోలో భారీ పైపుల లోడ్ తో ఒక పెద్ద ట్రక్కు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లడం చూడవచ్చు.అదే సమయంలో ఒక కారు డ్రైవర్ ఆ ట్రక్కు కిందకి వెళ్లాడు.
ట్రక్కు కింద కారు నడుపుతూ అతడు చాలా ప్రమాదకర స్థితిలో డ్రైవింగ్ చేశాడు.ఈ క్రమంలోనే ట్రక్కు సడెన్‌గా అడ్డంగా తిరిగింది.
అప్పటికీ ఆ కారు డ్రైవర్ ట్రక్ కిందే వెళ్లాడు.మరుక్షణంలోనే ట్రక్ లోని పైపులు కారు పైకప్పు తగిలాయి.
దాంతో అవన్నీ కింద పడిపోయాయి.అది బిజీ రోడ్డు కావడంతో పైపులు మిగతా కార్లకు అడ్డొచ్చాయి.
దాంతో చాలావాటికి డ్యామేజ్ అయ్యింది.
దీంతో అక్కడ సీన్ భయంకరంగా మారింది.వెనుక వస్తున్న కార్ల అద్దాలు డ్యామేజ్ అయ్యాయి.ఈ ఘోర దృశ్యం చూసేవారికి షాకింగ్ గా అనిపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా షాకింగ్గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.కొందరు మాత్రం ఇది గ్రాఫిక్స్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.