గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి పేరు మారుమోగిపోతుంది.కిరాక్ ఆర్పి జబర్దస్త్ షోపై, అలాగే మల్లెమాల సంస్థమీద సంచనాల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులాటిని సంపాదించుకున్న కిరాక్ ఆర్పి ఆ విషయాన్ని మరిచిపోయి జబర్దస్త్ షోపై నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.అయితే తాజాగా ఇదే విషయంపై జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్ స్పందిస్తూ కిరాక్ ఆర్పి ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని కామెంట్స్ చేశారు.
అదేవిధంగా అదిరే అభి కూడా ఈ విషయంపై స్పందించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి కిరాక్ ఆర్పి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.
ఆర్పీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్నాడు అభి.అదేవిధంగా ఆర్పీ చెప్పిన విషయాలు ఆయన వ్యక్తిగతం కాబట్టి ఎవరు ఎంత తీసుకోవాలి అనేది కూడా మనం చెప్పలేమని, కిరాక్ ఆర్పి చెప్పిన విషయాలు కొంతమందికి నచ్చవచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు అని అభి తెలిపారు.అనంతరం సుధీర్ జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లారు అన్న విషయం గురించి మాట్లాడుతూ.మల్లెమాల సంస్థలో కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయని అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత కొంతమంది ఉండాలి అనుకుంటే ఉండవచ్చు లేకుంటే వెళ్లిపోవచ్చు అని తెలిపారు అభి.

అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఒక గ్రూపులో ఉంటామని, అందులో ప్రతి ఒక్కరి పుట్టిన రోజుకు పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటామని తెలిపారు.అంతేకాకుండా ఎవరైనా సినిమాలలో నటిస్తున్నారు అంటే వారిని తప్పకుండా ప్రోత్సహిస్తూ గ్రూప్స్ లో మాట్లాడుకుంటాము అని అభి తెలిపారు.అయితే ఇదంతా ఏదో కాంట్రవర్సీ జరుగుతుందని తాను మాత్రం కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను అని తెలిపారు అదిరే అభి.అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.







