సాధారణంగా కొన్ని కొన్ని సినిమాలలో సూపర్ స్టార్స్ అతిథి పాత్రలో కనిపిస్తూ ఉంటారు.సినిమాను మలుపు తిప్పే క్రమంలో కొద్ది నిమిషాల పాటు వచ్చి కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు.
ఇప్పటికే ఎన్నో సినిమాలలో పలువులు స్టార్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.స్టార్స్ నటించడం వల్ల సినిమాకీ కూడా బాగా క్రేజ్ వస్తుంది.
కాగా ఇటీవలే విడుదలైన విక్రమ్ సినిమాలో హీరో సూర్య అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఆ పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ను తీసుకోలేదు హీరో సూర్య.
అలాగే మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాలో కూడా హీరో సూర్య అదృష్ట అప్పీరెన్స్ పాతంలో కనిపించిన తెలిసిందే.
ఇది ఇలా ఉంటే మరొక కోలీవుడ్ సూపర్ స్టార్ కూడా అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆ స్టార్ హీరో కూడా పారితోషం తీసుకోవడం లేదు అని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.ఆ హీరో మరెవరో కాదు తమిళ హీరో దళపతి విజయ్.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన రాజా చిత్రం జవాన్.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలుస్తుంది.అట్లీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అంతేకాకుండా హీరో విజయ్ జవాన్ సినిమా కోసం సమయాన్ని కూడా కేటాయించినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ లో 25 రోజులు పాటు చెన్నైలో చిత్రీకరించనున్నారు.ఆ సమయంలోనే విజయ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

అయితే ఈ సినిమాలో నటించడానికి విజయ్ పారితోషకం చేసుకోవడం లేదని తెలుస్తోంది.దర్శకుడు అట్లీ, హీరో షారుక్ ఖాన్ తో ఉన్న సాహిత్యం తో ఆ సినిమాలో నటించడానికి విజయ్ అంగీకరించినట్లు సమాచారం.జవాన్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలో విడుదల చేయనున్నారు.ఈ సినిమాను షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ అయినా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.కాగా ఈ సినిమాను 2023 జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.