దేశంలోని రైతన్నలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
రైతుల ఆదాయం, పెంపు ప్రోత్సాహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది.ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్రం తెలిపింది.
రబీ సీజన్, మార్కెటింగ్ సీజన్ కాలానికి గాను ఎంఎస్పీని పెంచుతూ సిసిఈఏ నిర్ణయం తీసుకుంది.మద్దతు ధర పెంచిన ఆరు పంటల్లో గోధుమలు, ఆవాలు, సన్ ఫ్లవర్, బార్లీ, మసూర్ పప్పుతో పాటు శనగలు ఉన్నాయి.