సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వల్ల ఒక వింత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక గుర్రానికి సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది.సాధారణంగా జంతువులు గవర్నమెంట్ వాహనాలలో అంటే బస్సులలో, రైళ్లలో ప్రయాణించడం చట్ట రీత్యా నేరం.
కేవలం మనుషులు మాత్రమే బస్సులలో, రైళ్లలో ప్రయాణం చేసే సదుపాయం ఉంది.కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన పెంపుడు గుర్రాన్ని తనతో పాటు రైలులో ఎక్కించుకుని ప్రయాణం చేయించాడు.
నిజానికి రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులతో కిటకిట లాడుతూ రద్దీగా ఉంటుంది.అలాంటిది ఒక రైలు కంపార్ట్‌మెంటులో మనుషుల మధ్యలో ఉండి గుర్రం కూడా ప్రయాణం చేయడం అంటే ఆషా మాషి విషయం కాదు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా డైమండ్ హార్బర్ డౌన్ లోకల్ రైలులో గురువారం నాడు చోటు చేసుకుంది.
40 ఏళ్ల గఫూర్ అలీ ముల్లా అనే వ్యక్తి గుర్రాన్ని పెంచుతున్నాడు.ఇటీవల దీనిని ఒక రేసులో అతను పరిగెత్తించాడు.అయితే రేస్ అనంతరం గుర్రం బాగా అలసిపోయింది.దీంతో దానిని రైలులో ఎక్కించి దక్షిణ్ దుర్గాపూర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రకు తరలించాలని అనుకున్నాడు ముల్లా.
అలా సియాల్దాకు దక్షిణాన ఉన్న డైమండ్ హార్బర్ ప్రాంతంలో గుర్రాన్ని రైలెక్కించాడు.రైలులో గుర్రం కూడా మనుషుల మధ్య నిలబడి ఉండటం మనం ఫోటోలో చూడవచ్చు.
ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించి దర్యాప్తు ప్రారంభించారు.ఆ తర్వాత ఆర్‌పీఎఫ్ అధికారులు నేత్ర ప్రాంతంలో గుర్రం యజమానిని గుర్తించి స్థానిక పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు.ఈస్టర్న్ రైల్వే ప్రతినిధి ఏకలవ్య చక్రవర్తి మాట్లాడుతూ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో జంతువులు ప్రయాణించడం నేరం అని వాటి కొరకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్ బుక్ చేసుకోవాలని చెప్పారు.’రైల్వే ఆస్తిని ఇలా ఉపయిగించుకోవడం చట్ట రీత్యా నేరం అని,రైలులో అనధికారికంగా మనుషుల స్థలాన్ని ఆక్రమించినందుకు అతనిపై రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము.’ అని తెలిపారు.