‘1’, ‘ఆగడు’ చిత్రాలు వరుసగా ఫ్లాప్‌లు అవ్వడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశను వ్యక్తం చేశారు.ఆ రెండు సినిమాలపై కూడా అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.
కారణాలను పక్కన పెడితే అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫ్లాప్ అయ్యాయి.ఈ విషయాన్ని మహేష్‌బాబు కూడా స్వయంగా ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకలో ఒప్పుకున్నాడు.
మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు నన్ను క్షమించండి అంటూ అభిమానులకు సభాముఖంగా క్షమాపణలు చెప్పాడు.ఇక ‘శ్రీమంతుడు’ సినిమా మిమ్ములను తప్పకుండా ఆకట్టుకుంటుందని మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.
మహేష్ మాటలకు ‘శ్రీమంతుడు’ సినిమాపై చాలా ఆశలు పెంచుకున్న సూపర్ ఫ్యాన్స్.విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ప్రేక్షకుల ఎదురు చూపులకు నేటితో బ్రేక్ వేశారు నిర్మాతలు.నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆకట్టుకుంటోంది.
అభిమానులకే కాకుండా ఈ సినిమా సాదారణ ప్రేక్షకులకు మరియు సినీ వర్గాల వారికి అలాగే విమర్శకులకు సైతం నచ్చుతోంది.‘బాహుబలి’ సినిమాను యావరేజ్ అన్న వారు కాస్త ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు భారీగా ఉండే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే సినిమాను మహేష్ ఇచ్చాడు.