యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’తో భారీ హిట్‌ను తాజాగా అందుకున్న విషయం తెల్సిందే.చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ఈ సక్సెస్‌ను అందుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ ఆనందం పోకుండానే ఎన్టీఆర్ మరో సినిమాను తీసుకు రావాలని అభిమానులు కోరుతున్నారు.కాని ఎన్టీఆర్ మాత్రం తన తర్వాత సినిమాను ఈ సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు లేవని తేలిపోయింది.
ఎన్టీఆర్ తర్వాత సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.
‘టెంపర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాకు ఇప్పటికే రంగం సిద్దం అయ్యింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.దర్శకుడు సుకుమార్ సినిమాలను చాలా స్లోగా తెరకెక్కిస్తాడు అనే పేరు ఉంది.
ఇప్పటి వరకు ఉన్న పేరును అలాగే ఉంచుకునేలా సుకుమార్ తాజాగా ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమా కూడా దాదాపు సంవత్సర కాలం తీయాలని నిర్ణయించుకున్నాడు.ఈ సినిమాను మెల్లగా షూటింగ్ చేసి, వచ్చే సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడు.
దాంతో ఎన్టీఆర్ అభిమానులు తర్వాత సినిమా కోసం దాదాపు సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే.ఇది ప్యాన్స్‌కు తప్పకుండా బ్యాడ్ న్యూసే.