డోంట్ అండర్ ఎస్టిమేట్ థి కామన్ మ్యాన్ అనేది ఆప్‌డ్ విజయం తరువాత అందరూ వాడుతున్న మాట.అయితే దాదాపుగా ఏకువశాతం ప్రజలు అందరూ ఆప్ విజయంపై సంతోషంతో ఉన్నారు…ఇక కేసెఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ.
ఢిల్లీ ప్రజలు ధైర్యమైన తీర్పిచ్చారని ప్రశంసించారు.ఇంతవరకూ ఎలా ఉన్నా….
అసలు చిక్కు ఇక్కడే వచ్చింది…ఢిల్లీ ప్రజల తీర్పును మెచ్చుకోవడం అంటే మోడీ పరాజయాంపై సంతోషం ప్రకటించడమే అన్న వాదన ఊపందుకుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆప్ విజయంపై చేసిన కామెంట్లు ఆసక్తిరేపుతున్నాయి.
శనివారం తనతో భేటీ అయిన తెలుగుదేశం నాయకులు కొందరు.ఆప్ విజయంపై సానుకూలంగా స్పందించారు.
ఈ ఫలితాలతో మోడీ కాస్త దిగివస్తారని.ఈ ఫలితాలతో మంచే జరిగిందని కొందరు చంద్రబాబుతో అన్నారు.
దీనికి భిన్నంగా స్పందించిన చంద్రబాబు.ఢిల్లీలో ఆప్ కాకుండా బీజేపీయే గెలిచి ఉండాల్సిందన్నారు.
ఢిల్లీలో ఆప్ గెలవడం వల్ల.సుస్థిరత దెబ్బతిని దేశాభివృద్ధి కుంటుపడుతుందని చంద్రబాబు కామెంట్ చేయడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగినట్టైంది.
సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్లే పెట్టుబడులు వస్తాయని.ఆ రకంగా చూస్తే బీజేపీయే గెలిచి ఉంటే బావుండేదని చంద్రబాబు అన్నారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన నాయకుడు.ఫలితాలు వచ్చాక కూడా ఇంకా బీజేపీయే గెలిచి ఉండాల్సిందని కామెంట్ చేయడం టీడీపీ నేతలకు మింగుడుపడలేదు.
కాకపోతే.ఆప్ విజయాన్ని ప్రశంసిస్తే.
రేపు మోడీకి పట్టిన గతే తనకూ పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది.ఏది ఏమైనా బాబుకు ఇంకా మోడి పై నమ్మకం పోలేదు.
ఆయన్నే నమ్ముకుని ముందుకు పోతున్నారు.