కాంగ్రెస్ 'విల్ బి'' బ్యాక్..క్రెడిట్ కమలానికే!!

కమలం పార్టీ రోజు రోజుకీ చిక్కుల్లో పడుతుంది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వాదన ప్రకారం హస్తాన్ని అస్తవ్యస్తం చేసిన కమలం పార్టీనే మళ్లీ జీవం పోస్తుంది అన్న వాదన బలంగా వినిపిస్తుంది.

 Bjp Loosing Its Power Day By Day-TeluguStop.com

విషయంలోకి వెళితే…బీజేపీ హనీమూన్ టైమ్ అయిపోయింది.ఇక ముందు ఆచి తూచి అడుగెయ్యకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని తెలుస్తుంది…ప్రత్యేకంగా డిల్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం, ఎన్నికలు జరిగిన పద్దతి, ఒపీనియన్ పోల్స్ వార్తలు చూస్తే బీజేపీ రోజు రోజుకూ పట్టు కోల్పోతుందేమో అన్న అనుమానం తప్పక కలుగుతుంది.

ఇదిలా ఉంటే మన ఏపీ విషయాన్ని ప్రస్తావించుకొంటే.భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గురించి ఎన్నో కబుర్లు చెప్పింది.

అయితే.ఇప్పుడు మాత్రం మొండిచెయ్యి చూపుతోంది.

ఈ విషయం అప్పుడే సీమాంధ్ర జనసామాన్యం వరకూ వెళ్లిపోయిందంటే పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు.కేంద్రం ప్యాకేజీ విషయంలో మోస పూరితంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది సగటు సీమాంధ్రుడి నుంచి.

ఎన్నికలయ్యి సరిగా ఏడాది కూడా పూర్తికాకుండానే బీజేపీ ఇలాంటి వ్యతిరేకత పెంచుకోవడం నిజంగాఆశ్చర్యకరం.ఏపీ లెవల్లో ఇలాంటి ఫ్యాక్టర్ పనిచేస్తోంది.

ఇక మిగతా రాష్ట్రాల్లో.దేశవ్యాప్తంగా కూడా ఇలాగే వివిధ అంశాలు పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూపీఏ పాలన పోయి.మోడీ జమానా వచ్చిన నేపథ్యంలో వచ్చిన తేడా ఏమిటి?! అనే అంశం గురించి జనసామాన్యం కూడా ఆలోచిస్తోంది.ఇప్పటికైనా మోడి సాబ్ దీనిపై ఒకింత దృష్టి పెడితే మంచిదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube