మెగాస్టార్ చిరంజీవి కోడలు.ఉపాసనా రెడ్డి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.
అయితే ఇదేదో రాజకీయం అనుకుంటే పొరపాటె.విషయం ఏమిటంటే…హైదరాబాదులోని చంద్రబాబు క్యాంప్కార్యాలయంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన ప్రతినిధులతో కలిసి ఉపాసనా చంద్రబాబుతో భేటీ అయ్యారు.
అయితే దీనికిగల కారణాలు చాలానే ఉన్నాయి…చిత్తూరు జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటుకు సహకరించాలని వారు చంద్రబాబును కోరినట్లు సమాచారం.అన్నీ పరిశీలించిన బాబు, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, కచ్చితంగా ప్రభుత్వ పరంగా సహకరిస్తామని తెలిపినట్లు సమాచారం.
అంతేకాకుండా వారు హెల్త్ సిటీ ఏర్పాటుకు భూమి, నీరు, విద్యుత్ ఇతర మౌలిక వసతులకు సంబంధించిన అనుమతులు సత్వరమే మంజూరు చేయించాలని బాబుని కోరారు.అన్ని సత్వరమే వస్తే పద్దెనిమిది నెలల్లో హెల్త్ సిటీని పూర్తి చేస్తామన్నారు.
ఇక బాబు సైతం దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.ఎంతైనా సొంత జిలా కదా.ఆమాత్రం స్పందన లేకపోతే ఎలా మరి.







