మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ( game changer movie ) ఇప్పటికే థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ షోకు( unstoppable show ) రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు కాగా ఈ షోలో భాగంగా చరణ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయ్.
రామ్ చరణ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా మరొకటి విడుదలైంది.
చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీలోనే అని రామ్ చరణ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ఆకట్టుకుంటున్నాయి.
గతంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సైతం ఒక సందర్భంలో ఇవే తరహా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.గేమ్ ఛేంజర్ సినిమాకు బెటర్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు కచ్చితంగా మరింత పెరిగేవని చెప్పవచ్చు.
చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీలోనే అంటూ చరణ్ చేసిన కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రామ్ చరణ్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.నిర్మాత దిల్ రాజుకు( Producer Dil Raju ) ఈ సినిమా కొంతమేర నష్టాలు మిగిల్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ తర్వాత సినిమాలతొ సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ కథాంశాలను ఎంచుకుంటే ఈ హీరో ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని చెప్పవచ్చు.సంక్రాంతి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం 65 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేశారని సమాచారం అందుతోంది.
చరణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.