సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ( Celebrities )సినిమాలలో అలాగే పలు యాడ్స్ లో నటించి కోట్లకు కోట్లు పారితోషికాన్ని అందుకొని కోట్లల్లో సంపాదించారు.కొంతమంది సినిమాలలో రాణిస్తూ వచ్చిన డబ్బులను బిజినెస్ లలో పెట్టుబడిగా పెడుతూ రెండు వైపులా సంపాదిస్తూ బాగానే ఆస్తులను కూడా బెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ( Bollywood industr )కూడా సెలబ్రిటీలు బాగానే వెనకేసుకున్నారు.మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫైవ్ కుబేరులు ఎవరు? ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో పలు యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు అమితాబ్ బచ్చన్.ఇటీవల కల్కి మూవీతో( Kalki movie ) మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే తాజాగా బాలీవుడ్ లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024 పేరుతో విడుదల చేసింది.
ఈ లిస్ట్‌లో అమితాబ్ నాలుగో ప్లేస్‌లో నిలిచారు.ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది.

అతని కంటే ముందు షారుఖ్ ఖాన్ రూ.7300 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో జూహీ చావ్లా( Juhi Chawla ) కుటుంబం రూ.4600 కోట్లతో నిలిచింది.మూడవ స్థానంలో హృతిక్ రోషన్ ( Hrithik Roshan )2000కోట్లతో నిలిచారు.ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్( Karan Johar ) రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.అయితే అమితాబ్ తన చిన్న వయసులో కోల్‌కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు.కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలో జాబ్ చేసేందుకు వెళ్లానని తెలిపారు.
ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు.కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.