కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్( RG Kar Medical Hospital )లో జూనియర్ డాక్టర్( Kolkata Doctor )పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.బాధితురాలికి న్యాయం చేయాలని , నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైద్య ప్రపంచం రోడ్డెక్కింది.
డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది నిరసన తెలియజేస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
హత్యాచారం తర్వాత నిందితులు ఆమె మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించినట్లుగా సీబీఐ పేర్కొంది.దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు( Supreme Court ) పోలీసులు, మెడికల్ కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరును ఆక్షేపించింది.
దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్యులను తక్షణమే విధుల్లో చేరాలని సూచించింది.

మరోవైపు .హత్యాచార బాధితురాలి కుటుంబానికి మద్ధతుగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతి వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.తాజాగా భారత్‌లో నిరసన తెలుపుతున్న డాక్టర్లకు మద్ధతుగా అమెరికా, కెనడాలలోని భారత సంతతి వైద్యులు కూడా సంఘీభావం తెలిపారు.
భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టమ్( Health care system )లో ఇప్పటికే ఉన్న సేఫ్టీ ప్రోటోకాల్‌లను సమీక్షించడానికి ఒక కమీషన్‌ను ఏర్పాటు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దీనికి సంబంధించిన లేఖపై వివిధ వైద్య సంఘాలు సంతకాలు చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపాయి.అలాగే ఆరోగ్య సంరక్షణ నిపుణులపై హింసను అరికట్టేందుకు సకాలమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.వైద్యులు, వైద్య సిబ్బందిపై నేరాలకు పాల్పడే వారికి భారీ జరిమానాలు విధించాలని వారు డిమాండ్ చేశారు.
సురక్షిత వాతావరణంలో నిర్భయంగా ప్రాక్టీస్ చేసేలా ఆరోగ్య సంరక్షణ కార్మికుల హక్కులను పరిరక్షించాలని సూచించారు.రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ , ఆరోగ్య మంత్రి, జాతీయ వైద్య కమీషన్, ఇండియన్ మెడికల్ కమీషన్‌కు కూడా వారు లేఖ రాశారు.