తిరుమల తిరుపతి ( Tirumala )వెంకన్న స్వామి వద్ద వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఉంటాయని స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.స్వామి వారిని బంగారంతో చాలా గొప్పగా అలంకరిస్తారు.
అయితే మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ కుటుంబం స్వామివారి అలంకరణకు తామేమీ తక్కువ కాదన్నట్లు 25 కిలోల బంగారు నగలు ధరించి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు.వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
బంగారు నగలు అందరి కళ్లను తమ వైపే తిప్పుకున్నాయి.
వీళ్లు వచ్చిన కారు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఎందుకంటే దీనికి బంగారు పూత పూశారు.ఈ పూణే ఫ్యామిలీ శ్రీవాణి ట్రస్ట్ ( Srivani Trust)కు భారీగానే డొనేషన్లు ఇచ్చుకున్నారు.వీఐపీ బ్రేక్‌లో తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.
మొక్కులు తీర్చుకున్నారు.వీళ్లు సాధారణ భక్తులలాగా కాకుండా ఒంటినిండా బంగారంతో మెరవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.
దాదాపు 25 కేజీలకు పైగా బంగారు నగలు ధరించి శ్రీవారి ఆలయం ముందు వీళ్లు నడిచారు.ఈ భక్తులు పూణేకు చెందిన గోల్డెమాన్లు అని తెలుస్తుంది.
వీరి పేర్లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రయ గుజర్, ప్రీతి సోనీ.దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా(Social media )లో చక్కర్లు కొడుతున్నాయి.
ఒక వీడియోలో కనిపించిన విధంగా మెడలో, చేతులకు గోల్డెన్ జువెలరీ వేసుకోవడం చూడవచ్చు.
ఇకపోతే తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం, హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం.ఈ ఆలయంలోని శ్రీవారిని సందర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి రోజూ లక్షలాది మంది వస్తుంటారు.ఈ శుక్రవారం, ఆగస్టు 23న ముగ్గురు భక్తులు 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి దేవాలయానికి వచ్చారు.
పుణె నుంచి వచ్చిన ఈ భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.ఒక రోజు ముందు అంటే ఆగస్టు 22న, తెలుగు సినీ నటుడు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి తన 69వ పుట్టిన రోజు సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కోరారు.
ఇక, జులై నెలలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కూడా శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు.