ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు దర్శకులుగా నిర్మాతలుగా మారుతుంటారు అలాగే దర్శకులు కూడా హీరోలుగా రాణిస్తూ ఉన్నారు.ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా మారిన వారిలో నటుడు పవన్ కుమార్ కొత్తూరి( Pawan Kumar Kothuri ) ఒకరు.
ఈయన మొదట మెరిసే మెరిసే సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అయితే తాజాగా ఈయన యావరేజ్ స్టూడెంట్ నాని( Average Student Nani ) అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.

కథ
నాని (పవన్ కుమార్) చదువు విషయంలో అంతంత మాత్రమే.ఇలా పెద్దగా చదువు లేకపోవడంతో తన తండ్రి ర్యాంక్ రాలేదని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు.ఇలా చదువులో పెద్దగా ఆసక్తి చూపకపోయినా బీటెక్ వరకు వెళ్తారు.
ఇలా బీటెక్ చేస్తూ ఉన్న నానికి సారా (స్నేహ) ను( Sneha ) చూసి ప్రేమలో పడతారు.నాని సీనియర్ అవుతాడు.ఇక జూనియర్‌తో ఫ్లర్టింగ్, సీనియర్‌తో ప్రేమ అంటూ నాని లైఫ్ జాలీగా వెళ్తుంది.మరి నాని జీవితంలో తన తల్లిదండ్రుల పాత్ర ఏంటి.
వీరిద్దరి ప్రేమ ప్రయాణం చివరికి ఫలించిందా.నాని జీవితంలో స్థిరపడ్డారా అన్నది ఈ సినిమా కథ.

నటీనటుల నటన:
దర్శకుడిగా ఇదివరకే ఒక సినిమా చేసిన పవన్ కుమార్ నాని పాత్రలో చూపించిన ఎమోషన్స్, షేడ్స్ అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి.ఒక యావరేజ్ కాలేజీ కుర్రాడు ఎలా అయితే నిజజీవితంలో ఉంటారో తెరపై నాని అలానే కనిపించాడు.రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌లో మెప్పిస్తాడు.ఈ చిత్రానికి హీరోయిన్ల గ్లామర్ ప్రధాన ఆకర్షణ.స్నేహా, సాహిబా ఇద్దరూ కూడా నటన విషయంలో అందం విషయంలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక వీరిద్దరూ వీరి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
రాజీవ్ కనకాలతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.విజువల్స్ విషయంలో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లారని చెప్పాలి.పాటలు( Songs ) కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ఫోటోగ్రఫీ ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంది.ఇక నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విశ్లేషణ:
ఇప్పటివరకు ఇలాంటి కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా కూడా ఫస్ట్ హాఫ్ అంతా జాలీగా సాగినట్టు అనిపిస్తుంది.నాని ఇంట్రడక్షన్, కాలేజ్ సీన్లు, హీరో హీరోయిన్ల లవ్, చిన్నపాటి గొడవలు రొమాంటిక్ సీన్లతో సినిమా మొత్తం అలా సాగిపోతుంది.ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త ఎమోషనల్ గా టర్న్ అవ్వడమే కాకుండా సెకండ్ హాఫ్ మొత్తం ఎంతో ఎమోషనల్ గా కొనసాగుతుంది.
ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ బాగా వర్క్ అవుట్ అయింది.ఇక ఈ సినిమా తరహాలో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ అనేది ఉండదు సరదాగా మన కాలేజీ రోజులను కూడా గుర్తు చేసుకోవచ్చు.