బిగ్ బాస్ కోసం 2 హౌజ్ లు ఏర్పాటు చేయనున్నారా.. ఆ కంటెస్టెంట్లు వస్తే షో హిట్టంటూ?

తెలుగులో అప్పుడే బిగ్ బాస్ హంగామా మొదలైంది.త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 Lot Of Rumors Sourrounding Bigg Boss Season 8 Details, Bigg Boss, Bigg Boss 8 Te-TeluguStop.com

ఇటీవలే అందుకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేయడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ బిగ్ బాస్ షో వేరే వినిపిస్తోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్ కి( Bigg Boss House ) సంబంధించి ఏదో ఒక రకమైన వార్త వినిపిస్తూనే ఉంది.

టీఆర్పీ పరంగా సీజన్-7 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్-8పై అంచనాలు మరింత పెరిగాయి.ఆ అంచనాలకు తగ్గట్టే పుకార్లు కూడా ఊపందుకున్నాయి.

Telugu Ambati Rayudu, Amrutha Pranay, Bigg Boss, Khayyum, Swathi Nayudu, Tollywo

ప్రతి సీజన్ కు ఉన్నట్టుగానే, ఈసారి కూడా ప్రారంభానికి ముందే హౌజ్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి.ఇప్పటికే సీజన్ 8 కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అమృతా ప్రణయ్,( Amrutha Pranay ) అలీ తమ్ముడు ఖయ్యుం,( Khayyum ) మై విలేజ్ షో ఫేమ్ అనీల్, స్వాతి నాయుడు, సోనియా సింగ్ లాంటి వాళ్లు బిగ్ బాస్ హౌజ్ లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.వీరితోపాటు ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ కూడా హౌజ్ లో ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, ఈమె ఇప్పటికే సదరు ఛానెల్ లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో కనిపించింది.

Telugu Ambati Rayudu, Amrutha Pranay, Bigg Boss, Khayyum, Swathi Nayudu, Tollywo

ఈమెతో పాటు వినోద్ కుమార్, అంబటి రాయుడు, అబ్బాస్, నటుడు రోహిత్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.వీళ్లు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరవ్వడం దాదాపు పక్కా అని అంటున్నారు.ఇక ఈసారి గ్లామర్ జోడించే బాధ్యతను విష్ణు ప్రియ( Vishnu Priya ) రీతు చౌదరిలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి సీజన్ మరింత రసవత్తరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ షో నిర్వాహకులు.ఈసారి 2 బిగ్ బాస్ హౌజ్ లు ఏర్పాటుచేసే ఆలోచన కూడా చేస్తున్నారట.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తుండగా అందులో పైన చెప్పిన సెలబ్రిటీల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఒకవేళ పైన చెప్పినట్టుగా ఆ సెలబ్రిటీలు కనుక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఈసారి హిట్ గ్యారెంటీ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube