యూపీఐ పిన్ ఇలా తేలికగా మార్చుకోండి!

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) పేమెంట్స్ దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.ఈరోజు రేపు చదువు లేనివారు కూడా ఈ పేమెంట్స్ చాలా తేలికగా చేసుకోవడంతో వీటి డిమాండ్ ఎక్కువయింది.

 Step By Step Process To Change Upi Pin Easily Details, Upi , Pin, Reset, Technol-TeluguStop.com

ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతీ ఒక్కరూ యూపీఐ( UPI ) నగదు బదిలీ చేస్తున్నారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.అవును, ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి జనాలు గంటలు తరబడి వేచి చూడాల్సి వచ్చేది.

దానికంటే యూపీఐ పేమెంట్స్ చేయడమే ఈజీ అని ప్రజలు ఇపుడు భావిస్తున్నారు.అంతలా యూపీఐ టెక్నాలజీ డిజిటల్ బ్యాంకింగ్( Digital Banking ) విప్లవాన్ని క్రియేట్ చేసింది.

Telugu Bank, Debit Cards, Latest, Ups, Upi Pin Change-Latest News - Telugu

అయితే ఈ సౌలభ్యం వెనుక ఎంతో కొంత రిస్క్ లేకపోలేదు.ఎందుకంటే నానాటికీ దేశంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య ఎక్కువైపోతోంది.దాన్ని అధిగమించాలంటే.మనం తరుచుగా యూపీఐ పిన్‌ను( UPI Pin ) మారుస్తూ ఉండాలనే సంగతి మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే యూపీఐ పిన్‌ను ఎలా మార్చాలి? అనే విషయం మీద చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు.అయితే అది చాలా తేలిక.ఆ విధానాన్ని ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం…

మీ యూపీఐ పిన్‌ను మార్చడానికి ముందు మీ డెబిట్ కార్డులోని( Debit Card ) చివరి 6 అంకెలను, కార్డుపై ఉండే గడువు తేదీ వివరాలను గుర్తు పెట్టుకోవాలి.

Telugu Bank, Debit Cards, Latest, Ups, Upi Pin Change-Latest News - Telugu

అన్నింటికంటే ముందు మీ ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంటుతో లింక్ అయి ఉండాలి.

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఏదైనా యూపీఐ యాప్‌ను తెరిచి.అందులోని మెనూ నుంచి ”బ్యాంక్ అకౌంట్”( Bank Account ) అనే ఆప్షన్‌ను ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ ఆప్షన్‌ సెలెక్ట్ చేయగానే.

“UPI PINని రీసెట్” అనే మరో ఆప్షన్ కబడుతుంది.దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి.

తరువాత డెబిట్ కార్డుకు సంబంధించిన చివరి ఆరు అంకెలు, డెబిట్ కార్డ్ గడువు ముగింపు తేదీని అక్కడున్న ఖాళీ గడులలో నింపాలి.

తరువాత ఫోనుకు వచ్చిన ఓటీపీని( OTP ) ఆటోమేటిక్‌గా యూపీఐ యాప్ రీడ్ చేస్తుంది.

చివరగా కొత్త యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి.రెండోసారి కూడా కొత్త యూపీఐ పిన్‌ను ఎంటర్ చేస్తే కొత్త యూపీఐ పిన్ నిర్ధారణ కబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube