ఏదైనా సినిమా కోసం ఈ మధ్య కాలంలో రెండు లేదా మూడేళ్ల సమయం చాలా అలవోకగా తీసుకుంటున్నారు.ఇక రాజమౌళి లాంటి దర్శకుడు అయితే మినిమం ఐదేళ్లు.
అలా చెక్కి చెక్కి చెక్కి సినిమాను ప్రేక్షకుల ముందు పెడతారు.ఆ సినిమాకు సంబంధించిన క్వాలిటీ లేదంటే రిజల్ట్ అనేది పక్కన పెడితే అన్నేళ్ల పాటు సినిమాలో తీయడం వల్ల ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి మరి పెంచి దాని ప్రభావం సినిమా పై పడే అవకాశం ఉంటుంది.
అందుకే కొన్ని మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి.ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.
అవి మొదలవడానికి చాలా ఏళ్ల టైం పట్టొచ్చు.మరి అలాంటి సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రావణం
ప్రశాంత్ నీల్, ప్రభాస్ ( Prashanth Neel, Prabhas )కాంబినేషన్ లో ఈ సినిమా రానుండగా ప్రస్తుతం అటు ప్రశాంత్ నీల్ ఇటు ప్రభాస్ ఇద్దరూ బిజీగానే ఉన్నారు.ఎన్టీఆర్ 31, సలార్ 2 తర్వాతే రావణం సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది.అంటే దాదాపు ఇంకో పది ఏళ్ళ సమయం పట్టొచ్చు.
కేజిఎఫ్ 3
ఈ సినిమా షూటింగ్ ని 2026లో ప్రారంభించ నున్నారట.షూటింగే 2026 లో మొదలెడితే అది పూర్తి అయ్యేది ఎప్పుడు ? ఇంకా విడుదల అయ్యేది ఎప్పుడు ? మనం చూసేది ఎప్పుడు.అంత ప్రశాంత్ నీల్ చేతిలోనే ఉంది.
బాహుబలి 3
ఈ సినిమా చేయాలనే ఆసక్తి అందరి కన్నా ఎక్కువగా రాజమౌళికే ఉంది.అయితే దీన్ని చేయాలంటే మాత్రం మహాభారతం( Mahabharata ) తీసిన తర్వాతే తీస్తాడట.ప్రస్తుతం మహేష్ బాబుతో తీస్తున్న సినిమా పూర్తి అవ్వడానికి మూడేళ్ల టైం పడితే అది అయిపోయాక మహాభారతం ఎప్పుడు తీస్తారు ? ఆ తర్వాత బాహుబలి 3 ఎప్పుడు తీస్తారు ?.
మహాభారతం
రాజమౌళి( Rajamouli ) ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నాడు ఈ ప్రాజెక్టు పై పని చేయాలని.మరి ఆయన కలలు నెరవేయడానికి సమయం మాత్రం ఎప్పుడూ అనేది చెప్పలేదు.అది ఎప్పుడు అవుతుందో కూడా ఆయనకి తెలియదు.