స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబీ కాంబో మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది.
బాలయ్య బాబీ కాంబో మూవీ గ్లింప్స్ బాగానే ఉన్నా గ్లింప్స్ లో బాలయ్యకు డైలాగ్స్ లేకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.

ఈ సినిమా గ్లింప్స్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.టైటిల్ గురించి, రిలీజ్ డేట్ గురించి మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు.బాలయ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.
మరోవైపు అఖండ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాలుగో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.14 రీల్స్ నిర్మాతలకు ఒక సినిమా చేస్తానని మాట ఇవ్వగా ఆ మాటను నిలబెట్టుకున్నారు.మరోవైపు ఈ సినిమాకు తేజస్వి( Tejaswini )ని సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
బాలయ్య కొడుకు కంటే చిన్న కూతురే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తేజస్విని ఈ సినిమాతో నిర్మాతగా కచ్చితంగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ అఖండ సీక్వెల్ గా తెరకెక్కుతుండటం గమనార్హం.బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ అఖండ సీక్వెల్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
బాలయ్య మాస్ కథలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై ఫోకస్ పెట్టారు.