ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.విచారణలో భాగంగా ఈ నెల 15వ తేదీ లోపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ దాఖలు చేయనుంది.
మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal), ఆమ్ ఆద్మీ పార్టీతో(Aam Aadmi Party) పాటు బీఆర్ఎస్ (brs)ఎమ్మెల్సీ కవితపై(Kavita) ఈడీ సంయుక్త ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.లిక్కర్ పాలసీ కేసులో కవిత, కేజ్రీవాల్(Kavita, Kejriwal) రెండు నెలల కస్టడీ పూర్తి కానున్న నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ సన్నద్ధమైంది.
కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.లిక్కర్ పాలసీ రూపకల్పనలో రూ.100 కోట్ల ముడుపులపై ఇప్పటికే ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది.ఈ క్రమంలోనే రూ.45 కోట్లను 2022 గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ ఆరోపిస్తుంది.అదేవిధంగా లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్, కవితలది ప్రధాన పాత్రని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.