సమయం ఉదయం పదకొండు గంటలు.అదొక విమానశ్రయం.
అక్కడ వచ్చీ పోయే జనాలతో ఇక్కడి ప్లాటఫారమ్స్ ఫుల్ గా ఉన్నాయి.వారి గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నారు.
ఇంతలో ఓ జంట, వారి మూడేళ్ల చిన్నారితో అక్కడికి చేరుకున్నారు.ఇక అక్కడ కాలం గడిచిపోతూ ఉంది.
ఎవరి గోలలో వాళ్లు ఉన్నారు.ఇక చిన్నారితో వచ్చిన జంట కూడా వారి ఫోన్లు చెక్ చేస్తూ, మాట్లాడుతూ బిజీ అయిపోయారు.
ఓ పక్కన వారి గారాల బిడ్డను ఓ కంట కనిపెడుతూనే ఉన్నరు పేరెంట్స్ ఇద్దరూను.అయితే వారు జస్ట్ కాసేపు అటు తిరిగారో లేదో.
ఆ అల్లరి పిల్లోడు క్షణాల్లో వారి దెగ్గర నుండి మాయమైపోయాడు.
ఒకవేళ వారు వాళ్ళ పిల్లాడిని గమనించడంలో ఇంకో కొన్ని క్షణాలు ఆలస్యమైతే మాత్రం ప్రాణం పోయేది.ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.అసలు ఏం జరిగిందంటే.
చిలీలోని శాంటియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో పేరెంట్స్ తో ఉన్న మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి అక్కడ దగ్గరలోని లగేజీ కన్వేయర్ బెల్ట్ పై ఎక్కి కూర్చున్నాడు బుడ్డోడు.అది కదులుతూ ముందుకు పోవడంతో ఆ పిల్లడు కూడా చాలా దూరం వెళ్లిపోయాడు.
కాకపోతే వారి పేరెంట్స్ మాత్రం ఇదంతా ఏమి గమనించలేదు.
వాళ్లు ఫోన్ నుండి తేరుకునే సరికి అక్కడ చిన్నారి కనబడపోవడంతో వారు వెంటనే అలర్ట్ కాగా.రోదిస్తూ వెతకసాగారు.విషయాన్నీ గమనించిన ఎయిర్ పోర్టు( Airport ) సిబ్బంది కూడా వెతకడం మొదలు పెట్టగా.
కదులుతున్న కన్వేయర్ బెల్టుపై బాలుడు ఉన్నట్లు గుర్తించారు.అక్కడి పరిస్థితి గమనించినట్లైతే.
ఆ చిన్నారి మరికొద్ది క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం కనపడుతుంది.అదృష్టం కొద్దీ ఈ లోగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కన్వేయర్ బెల్టుకు సంబంధించిన రోల్స్ అన్నీ దాటుకుంటూ వెళ్లి చిన్నారి ప్రాణాలను కాపాడారు.
ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.వీడియో చూసిన వారిలో అలర్ట్ నెస్ పెంచుతోంది.
కేవలం కొన్ని క్షణాలు ఆలస్యమైతే ప్రాణాలు గాలిలో కలిసేవి కదా’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా., మరికొందరేమో.
‘పేరెంట్స్ ఇది చూసైనా అలర్ట్ అవ్వండి.మీ పిల్లలు జాగ్రత్త’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.